KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 26 NOVEMBER 2024: The Koil Alwar Tirumanjanam in connection with the annual Karthika Brahmotsavams at Tiruchanoor was held on Tuesday.
Before the nine day annual festival, it is a tradition to clean the entire temple premises and this Agamic ritual is called Koil Alwar Tirumanjanam.
As a part of this, after Suprabhatam, Sahasra Namarchana, Suddhi, the temple cleaning activity was observed from 6am to 9am.
TTD has cancelled Kalyanotsavam and Unjal Seva in connection with this ritual.
Curtains Donated
Following the mega festival, Hyderabad based Sri Swarna Kumar Reddy has presented six curtains to the temple while Tirupati devotees Sri Sudhakar, Sri Jayachandra Reddy, Sri Arun Kumar have donated four curtains and 25 Hundi Covers and handed over them to JEO Sri Veerabrahmam.
Ankurarpanam for the festival will be observed in the temple on November 28.
JEO’s Smt Gowthami, DyEO Sri Govindarajan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 నవంబరు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టిటిడి జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
పరదాలు విరాళం :
ఈ సందర్భంగా ఆలయానికి హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణకుమార్ రెడ్డి ఆరు పరదాలు, రెండు కురాళాలు, తిరుపతికి చెందిన శ్రీ సుధాకర్, శ్రీ జయ చంద్రారెడ్డి, శ్రీ అరుణ్ కుమార్ నాలుగు పరదాలు 25 హుండీ వస్త్రాలు విరాళంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందించారు.
నవంబరు 28 నుండి బ్రహ్మోత్సవాలు :
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 27వ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.