KOIL ALWAR TIRUMANJANAM OF GT _ జూన్ 02 నుంచి జూన్ 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

TIRUPATI, 25 MAY 2025: The traditional temple cleansing ritual Koil Alwar Tirumanjanam will be observed in Sri Govindaraja Swamy temple on May 29.

Koil Alwar Tirumanjanam will be observed from 6:30am to 9:30am. Pilgrims will be allowed for Darshan from 10am onwards.

Meanwhile the annual Brahmotsavams in Sri Govindaraja Swamy temple will be observed from June 02 to 10 with Ankurarpanam on June 01.

The important days includes Dhwajarohanam on June 02, Garuda Vahanam on June 06, Radhotsavam on June 09, Chakra Snanam and Dhwajavarohanam on June 10.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

జూన్ 02 నుంచి జూన్ 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

– మే 29న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025, మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేప్టటింది. జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

02.06. 2025.

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

03.06. 2025.

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

04.06. 2025.

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

05.06. 2025.

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

06.06. 2025.

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

07.06. 2025.

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

08.06. 2025.

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

09.06. 2025.

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

10.06. 2025.

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మే 29న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆలయంలో మే 29వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూన్ 02 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరిసరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.