KOIL ALWAR TIRUMANJANAM ON APRIL 28 AT SRI VEDANARAYANA SWAMY TEMPLE _ ఏప్రిల్ 28న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, April 23, 2026: Koil Alwar Tirumanjanam will be performed on April 28 at Sri Vedanarayana Swamy Temple, Nagalapuram. This ritual is traditionally conducted before the annual Brahmotsavams scheduled from May 1 to 9.
On the same day, Suprabhatam, Thomala Seva and Archana will be performed in the early morning. The Koil Alwar Tirumanjanam will take place from 7:30 AM to 12:30 PM.
During the ritual, the temple premises, walls, ceiling and puja materials will be cleansed and sanctified. Holy water mixed with fragrant ingredients will be sprinkled throughout the temple.
Devotees will be allowed for darshan from 1:00 PM onwards.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 28న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి,2026ఏప్రిల్ 23: నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 1 నుండి 9 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముందు ఈ కార్యక్రమం ఆనవాయితీగా చేపడతారు.
అదే రోజు తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల సేవ, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఆలయం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
మధ్యాహ్నం 1 గంట నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది
