KOIL ALWAR TIRUMANJANAM ON SEPTEMBER 2 _ సెప్టెంబ‌రు 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ‌ఆళ్వార్ ‌తిరుమంజనం

Tirupati, August 24, 2025: In connection with the annual Pavithrotsavams of Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor, Koil Alwar Tirumanjanam will be performed on September 2.

The sacred cleaning ritual will take place from 7:00 AM to 9:30 AM. In view of this, Kalyanotsavam and Unjal Seva will remain cancelled on that day.

The Pavithrotsavams will be observed in the temple from September 5 to 7 with religious fervour and grandeur with Ankurarpanam on September 4. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 2 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి, 2025 ఆగ‌స్టు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 2న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుండి 7వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 4న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 5న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న మహాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.