KOLATAM, CHANDA MELAM CAPTIVATES DEVOTEES DURING SIMHA VAHANAM SEVA _ సింహ వాహనసేవలో ఆకట్టుకున్న చండ మేళం
TIRUPATI, 10 FEBRUARY 2026: As part of the ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram, devotees were enthralled by the vibrant Chanda Melam and Kolatam cultural performances during the Simha Vahanam Seva held on Tuesday morning.
The cultural programmes were organised under the auspices of the TTD Hindu Dharma Prachara Parishad and Dasasahitya Project.
The Kerala Drums popular by the traditional name ‘Chanda Melam’ was performed by the Sri Srikar troupe of Swami Koragajja Kala Samithi from Udupi, Karnataka.
The troupe, consisting of 10 artistes, played drums in perfect rhythm, synchronised with energetic dance movements.
The artistes have been participating in Brahmotsavams of TTD-affiliated temples for the past eight years.
Likewise, Kolatam dance performances by various cultural troupes added colour and vibrancy to the event and captivated the devotees.
These included 16 artistes from Hare Srinivasa Kolata Bhajana troupe of Suryapet, Telangana,
100 artistes from Sri Lakshmi Ganapati, Sri Prasanna Venkateswara Sri Satyakrishna Bhajana Mandali of Krishnayyapalem, West Godavari district,
15 artistes from Tadepalligudem, and cultural troupes from Tirupati.
The performances enhanced the spiritual fervour of the Simha Vahanam Seva and drew an enthusiastic response from devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనసేవలో ఆకట్టుకున్న చండ మేళం
తిరుపతి, 2026 ఫిబ్రవరి 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సింహ వాహనసేవలో చండ మేళం, కోలాటాల కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
చండమేళం
కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన స్వామి కొరగజ కళా సమితి శ్రీ శ్రీకర్ బృందం చండమేళం (కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు. కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం 10 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. వీరు గత 8 సంవత్సరాలుగా టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు.
కోలాటాల ప్రదర్శనలు
అదేవిధంగా, తెలంగాణ రాష్ట్రం సూర్యపేటకు చెందిన హరే శ్రీనివాస కోలాట భజన బృందంలోని 16 మంది, పశ్చిమ గోదావరి జిల్లా క్రిష్ణయ్యపాళ్యంకు చెందిన శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ ప్రసన్న వేంకటేశ్వర శ్రీ సత్యక్రిష్ణ భజన మండలికి చెందిన 100 మంది, తాడేపల్లి గూడెంకు చెందిన 15 మంది, తిరుపతికి చెందిన కళా బృందాలు కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది




