KOYA DANCE STEALS THE LIME LIGHT _ కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

TIRUPATI, 13 NOVEMBER 2023: Koya Dance performed by students of SV College of Music and Dance in front of Kalpavriksha Vahanam on Monday enthralled the devotees.

The other performances included Lakshmi Koutam, Mela Vinyasam, Gopika Natyam, Mayura Nrityam, Ribbon dance which enhanced the grandeur of Brahmotsava vahana vaibhavam.

All Projects Program Officer Sri Rajagopal, DASA Project Special Officer Sri Ananda Theerthacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2023 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 11 కళాబృందాల్లోని కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించారు.

తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు వివిధ దేవతామూర్తుల అలంకరణలతో, పలు అన్నమయ్య సంకీర్తనలకు చక్కటి కూచిపూడి
నృత్య ప్రదర్శన చేశారు. తిరుపతికి చెందిన మహిళలు కోయ డాన్స్ (ఎరుకులసాని వేషధారణలో), నెల్లూరు శ్రీ గురు కృప కళాక్షేత్రంకు చెందిన కళాకారులు లక్ష్మీ కౌతం నృత్య రూపకం ప్రదర్శించారు.

తమిళనాడు సేలంకు చెందిన కళాకారులు వీర నాట్యం, గోపిక నృత్యం, మేల విన్యాసం,వైలాట్యం, రిబ్బన్ డాన్స్, నెమలి డాన్స్ తో భక్తులను పరవశింప చేశారు.

టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, కళాబృందాలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.