TTD EO RELEASES ANNUAL BRAHMOTSAVAM WALL POSTERS _ తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన టిటిడి ఈవో

Tirupati, 18 March 2025: TTD EO Sri J. Syamala Rao released the wall posters of the annual Brahmotsavam of Tirupati Sri Kodandarama Swamy on Thursday evening in his Chamber in the TTD administration building.  

Speaking on the occasion, the EO said that the annual Brahmotsavams of Tirupati Sri Kodandarama Swamy temple will be held from 27th March to 4th April.

Similarly, Sri Ramanavami utsavams will be held from April 06 to April 08 and Teppotsavams from April 10 to 12.

The EO ordered the temple authorities to make arrangements without causing any inconvenience to the devotees.  

The Koil Alwar Tirumanjanam will be observed on March 25, Ankurarpanam on March 26 and the Flag Hoisting ceremony, Dhwajarohanam on March 27 in Meshlagnam from 9.15 am to 9.30 am in the background of the annual Brahmotsavam.   

Rathotsavam will be held on April 3rd at 9.15 am and Sri Sitarama Kalyanam ceremony will be held on April 7th from 7 pm to 9.30 pm.   

He directed to paint white coolants and provide drinking water facilities to enable the devotees.

In this event, the temple priests, Deputy EO Smt Nagaratna, AEO Sri Ravi and others participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన టిటిడి ఈవో

తిరుపతి, 2025, మార్చి 18: తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 04వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వాల్ పోస్టర్లను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం జరిగింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, తిరుపతి శ్రీకోదండరామ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 27 నుండి ఏఫ్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్నాయని, అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవములు ఏప్రిల్ 06 నుండి ఏప్రిల్ 08 వరకు, తెప్పోత్సవములు ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ అధికారులను ఈవో ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు.

అదేవిధంగా, వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుండి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.