KSHEERADHIVASAM HELD IN VAKULAMATA SHRINE _ శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
TIRUPATI, 20 JUNE 2022: As part of ongoing Mahasamprokshanam festivities in Vakulamata temple in Patakalva near Tirupati, Ksheeradhivasam ritual was observed on Monday.
In the evening, Kalasaradhana, Visesha Homams and other Agama rituals were observed under the supervision of Agama Advisor Dr Vishnu Bhattacharyulu.
TTD Board member Sri Ashok Kumar, Spl Gr DyEO Smt Varalakshmi, DyEO Sri Gunabhushan Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
తిరుపతి, 2022 జూన్ 20: తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు పండ వద్ద )లో టీటీడీ నిర్మించిన శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, నవకలశ స్నపన క్షీరాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహనికి వేద మంత్రాల మధ్య పాలతో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు కలశారాధన, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి, ఆగమ సలహా దారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు, ఇతర అధికారులు, రుత్వికులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.