KT BILWARCHANA _ నవంబరు 9న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
TIRUPATI, 08 NOVEMBER 2025: The ceremonious Laksha Bilwarchana will be observed in Sri Kapileswara Swamy temple on Sunday.
The devotees can participate in this ritual on payment of Rs. 100 per ticket.
Owing to this fete, darshan will be from 6am to 3pm and again from 5:30pm to 8:30pm.
In the evening the celestial procession of Chandrasekhara Swamy Utsava murthy takes place.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 9న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన
తిరుపతి, 2025 నవంబరు 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 9వ తేదీన ఆదివారం లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారు. ఒక్కొక్కరు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి లక్ష బిల్వార్చన సేవలో పాల్గొనవచ్చు.
ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.
