KUCHIPUDI DANCE ALLURES _ నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న కుమారి శ్రేయా జోషర్ కూచిపూడి నృత్యం

The Kuchipudi dance performed in the Nada Neerajanam platform enthralled the devotees.

Kum Shreya Josher, daughter of JEO Sri Veerabrahmam along with her teammates performed the dance ballet choreographed by Dr Usha Rani.

EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, and CVSO Narasimha Kishore also participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న కుమారి శ్రేయా జోషర్ కూచిపూడి నృత్యం

 తిరుమ‌ల‌, 2023 అక్టోబరు 16 ; తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన వి.శ్రేయా జోషర్ కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. తిరుపతిలోని రాజరాజేశ్వరి డ్యాన్స్ అకాడమీకి చెందిన శ్రీమతి ఉషారాణి ఆధ్వర్యంలో కళాకారులు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. 

ఇందులో టీటీడీ జెఈఓ శ్రీ వీరబ్రహ్మం కుమార్తె వి.శ్రేయా జోషర్ తో పాటు తేజోన్మయి, దీక్ష, మనస్విని తదితర కళాకారులు భక్తిగీతాలకు చక్కగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తదితరులు వీక్షించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.