KUMARADHARA THEERTHA MUKKOTI OBSERVED WITH RELIGIOUS FERVOUR _ తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

Tirumala, 9 Mar. 20: The torrent festival of Kumaradhara Theertha Mukkoti was observed with religious fervour in Tirumala on Monday.

The annual ‘Mukkoti’ festival of Kumaradhara Teertham was held coinciding with the auspicious ‘Magha Pournami’, at Tirumala. A special puja was performed by the Tirumala Tirupati Devasthanams (TTD) in the sacred Theertham on the day.

The three crore Theerthas, believed to be present in the Seshachalam ranges, are broadly divided into four categories viz., ‘Dharma Ratiprada’, ‘Gnanaprada’, ‘Bhaktivairagyaprada’ and ‘Muktiprada’. The Kumaradhara Theertham falls under the last category and is considered as the first and foremost with its significance explained in Vamana, Varaha, Padma and Markandeya Puranas of Venkatachala Mahatyam.

According to Vamana and Varaha Puranas, the Theertham attained the name after an old man was transformed into a teenager by the Lord Himself moved by his devotion. In Sanskrit, the teenager is referred to as ‘Kaumara’ or ‘Kumaradasa’ and hence the name.

Devotees thronged in large numbers to take part in the torrent festival on Monday. TTD has made elaborate Annaprasadam and Buttermilk arrangements while the Engineering and Forest Wings of TTD provided the way to reach the Theertham with ease by making necessary arrangements.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమ‌ల‌, 2020 మార్చి 09: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి సోమ‌వారంనాడు ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

ఫాల్గుణ మాసం పుబ్బ న‌క్ష‌త్రం పూర్ణిమనాడు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిండాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తులు కొండ‌మార్గాల్లో సౌక‌ర్య‌వంతంగా న‌డిచేందుకు వీలుగా ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు.  అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ పంపిణీ చేశారు.

ప్రాశస్త్యం :

వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ధ‌ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.