KUNDA CHATURDI OBSERVED WITH RELIGIOUS FERVOUR _ ధ్యానారామంలో శివుడికి కుంద కుసుమార్చన
Tirupati, 15 February 2021:As part of it’s the promotion of Hindu Sanatana Dharma, TTD mulled month-long Magha Masa Puja.
On Monday evening, Kunda Kusumarchana was observed with religious fervour in Dhyanaramam at Tirupati by SV Vedic University scholars on the auspicious day of Magha Chaturthi.
The unique feature about this fete is that the giant Shiva Linga was offered Abhishekam with jasmines. Explaining its significance the Vedic pundits said that Kunda means Jasmines and as it’s flowering commences in Magha Masam, Lord Shiva who is also worshipped as Rudra was offered a floral bath with jasmines to appease Him to bestow His benign blessings and protect humanity from calamities and diseases.
The Vedic pandits chanting Rudra Trisati, chanting 300 divine names on the occasion.
The event was live telecasted between 7pm and 8pm on SVBC for the sake of global devotees.
Additional EO Sri AV Dharma Reddy, SVVU VC Prof.Sannidhanam Sudarshana Sharma, Vedic scholars were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్యానారామంలో శివుడికి కుంద కుసుమార్చన
తిరుపతి 15 ఫిబ్రవరి 2021: హిందూ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం లోని ధ్యానారామంలో సోమవారం రాత్రి పరమశివుడికి కుంద కుసుమార్చన ( మల్లె పూలు) నిర్వహించారు. మాఘ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రపంచ శాంతి, సమస్త మానవులకు మంచి జరగాలని పరమ శివుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముందుగా లోక క్షేమం, శాంతిని కాంక్షిస్తూ గణపతి పూజ చేసి భక్తులతో కూడా సంకల్పం చేయించారు. మాఘ శుక్ల చతుర్థిని కుంద చతుర్థి అని కూడా పిలుస్తారని వేద పండితులు వివరించారు. ఈ రోజు పరమ శివుడిని మల్లె పూలతో అర్చిస్తే అఖండ ఐశ్వరం సిద్ధిస్తుందని కుంభ పురాణంలో పేర్కొన్నారని చెప్పారు. రుద్రాధ్యాయం లోని మంత్రాలు పఠిస్తూ షోడ సోపచార పూజ చేశారు. త్రిశత నామావళితో ఉమామహేశ్వరుడిని అర్చించారు. వివిధ దళాలు ( ఆకులు) తో పాటు మల్లె పూలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నీరాజనం, నక్షత్ర హారతి ఇచ్చి, మంత్ర పుష్పం, క్షమా ప్రార్థన చేశారు. చివరగా శ్రీ ఉమామహేశ్వరునికి మంగళ హారతి ఇచ్చారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులు, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ తో పాటు వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది