LADDUS PREPARATION AS PER DITTAM- POTU WORKERS _ నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ
NO COMPROMISE ON THE QUALITY OF SRIVARI LADDUS
Tirumala, 09 December 2023: The Sri Vaishnava Brahmin workers who have been engaged in the task of making Srivari laddu Prasadams since several centuries for generations at Srivari temple in Tirumala asserted that there is no compromise on the quality and taste in preparing the most sought after and prestigious Laddu Prasadams.
In the light of some suggestions made by the devotees during the recent monthly Dial your EO program about the quality of Laddus, a meeting was held with the Laddu workers with the concerned officials at Vaibhavotsava Mandapam in Tirumala on Saturday.
Speaking on the occasion, they said making Srivari laddus is their prime duty since several centuries. There is no change or compromise in the taste or quality of Laddus as the ingredients used are as per Dittam as supplied by the TTD officials. They affirmed that there is no scope on diminished quality of laddus.
Srivari temple DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari, Potu Peishkar Sri Srinivasulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ
– వైభవోత్సవ మండపంలో పోటు సిబ్బందితో ప్రత్యేక సమావేశం
తిరుమల, 2023 డిసెంబరు 09: నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని తిరుమల శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. ఇటీవల డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో లడ్డూ నాణ్యతకు సంబంధించి పలువురు భక్తులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని టీటీడీ అధికారులు పోటు సిబ్బందితో తిరుమల వైభవోత్సవ మండపంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోటులో పనిచేస్తున్న పలువురు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాట్లాడుతూ తాము కొన్ని తరాలుగా పారంపర్యంగా లడ్డూ తయారీలో నైపుణ్యం సాధించామని చెప్పారు. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర ఎండు ద్రాక్ష, బాదం తదితర అన్ని దినుసులను దిట్టం ప్రకారం టీటీడీ అధికారులు అందిస్తున్నారని, వీటిని వినియోగించి నాణ్యంగా లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామని వివరించారు. ఈ మేరకు లడ్డూ నాణ్యత తగ్గే అవకాశం లేదని చెప్పారు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.