LAKSHA BILWARCHANA OBSERVED _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన
TIRUPATI, 09 NOVEMBER 2025: The Laksha Bilwarchana was observed in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday.
Devotees participated in this religious event with utmost devotion.
Later in the evening, Sri Chandrasekhara Swamy Utsava Murthy was paraded along temple streets.
Temple officials were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన
తిరుపతి, 2025 నవంబరు 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.
సాయంత్రం శ్రీ చంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.





