LAKSHA KUMKUMARCHANA AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
Tirupati, 3 Sep. 21: TTD is organising the holy celebration of Laksha Kumkumarchana of Sri Kamakshi Ammavaru on the last Friday of Shravana month in Ekantha as per Covid guidelines in Sri Kapileswara Swamy Temple.
As part of the festivities the Kumkumarchana was performed to Utsava idols of Sri Mahalakshmi, Sri Saraswati and Sri Kamakshi Devi after seating them at the Mandapam.
After Kalasasthapana, Ganapati puja, Punyahavachanam and Kalasa Aradhana, Kumkumarchana was performed for one lakh times.
Temple DyEO Sri Subramaniam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupathi, Inspector Sri Reddy Sekhar were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి, 2021 సెప్టెంబరు 03: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేపట్టారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్ పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.