LAKSHA BILWARCHANA HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన

TIRUPATI, 19 NOVEMBER 2024: The ritual of Laksha Bilwarchana held in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.

Later in the evening, the Utsava deities of Sri Chandrasekhara Swamy and Sri Kamakshi Devi were paraded along streets encircling the temple.

DyEO Sri Devendra Babu and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన

తిరుప‌తి, 2024 నవంబరు 19: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.

సాయంత్రం శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామివారి ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.