LAKSHMI KASULA HARAM _ వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

TIRUPATI, 21 JUNE 2024: Lakshmi Kasula Haram from Tirumala was brought to Appalayagunta to be adorned to Sri Prasanna Venkateswara for Garuda Seva on Friday night.
 
Tirumala temple DyEO Sri Lokanatham, AEO Sri Ramesh and others were present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుపతి, 2024 జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సందర్బంగా శుక్రవారం తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి గరుడ సేవను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారంను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీకాసులహారానికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  ఏఈఓ శ్రీ రమేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది