LAKSHMI KASULA HARAM PROCESSION IN TIRUCHANOOR _ తిరుచానూరులో వైభవంగా లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర‌

Tirupati, 21 November 2025: The Srivari Lakshmi Kasula Haram procession was held in Tiruchanoor on Friday. 

Initially, the Additional EO Sri Ch Venkaiah Chowdary brought the Laxmi Kasula Haram from the Tirumala Srivari Temple to the Shilparamam – Pasupumandapam in Tiruchanoor. 

After special prayers were performed there, it was taken to the temple in a procession through the Mada streets amidst the playing of auspicious instruments, bhajans and kolatas.

Speaking on the occasion, TTD EO said that the Lakshmi Kasulaharam is the most important among Srivari jewels and this ornament is usually adorned on Sri Malayappa Swamy during the occasion of the Garuda Seva on every full moon day.

He said that it is customary to decorate Sri Padmavati Ammavaru with this ornament, which is decked during the Gaja Vahana and Garuda Vahana Sevas. 

He explained that extensive arrangements have been made for the Gaja Vahana seva to be held on Monday night.pp

JEO Sri Veerabrahamam, Deputy EOs Sri Lokanatham, Sri Harindranath, priests, other officials and a large number of devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరులో వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర‌

గ‌జ‌, గ‌రుడ వాహ‌నాల్లో అమ్మ‌వారికి అలంక‌ర‌ణ‌

టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుపతి, 2025 న‌వంబ‌రు 21: తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర శుక్ర‌వారం తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. ముందుగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం – ప‌సుపుమండ‌పం వద్దకు తీసుకొచ్చారు. అక్క‌డ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల‌లో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్ర‌ధాన‌మైంద‌ని, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా ఈ హారాన్ని శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి వారికి అలంక‌రిస్తామ‌ని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధ‌రించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. సోమవారం రాత్రి జ‌రుగ‌నున్న గ‌జ వాహ‌నానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్టు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.