LAKSHMI KASULAMALA SHOBA YATRA HELD _ లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
EXTENSIVE ARRANGEMENTS FOR DEVOTEES FOR PANCHAMI THEERTHAM FETE- TTD EO
Tirumala, 24 November 2022: The prestigious Lakshmi Kasula Haram of Srivaru was brought to Tiruchanoor to be decorated to Goddess Padmavati during Gaja and Garuda vahanas in the ongoing Karthika Brahmotsavam.
Speaking to media on the occasion at Tirumala on Thursday the TTD EO said the Tiruchanoor Sri Padmavati Ammavaru Brahmotsavams are going on in a grand manner with the participation of devotees this year after two years of the Covid Pandemic.
He said anticipating huge crowds, extensive arrangements are being made for the Panchami Thirtham fete on November 28.
He said in view of the Gaja vahana, the favourite vahanam of Goddess Padmavati, the precious and prestigious Lakshmi Kasulamala after special pujas was being brought from Tirumala to Tiruchanoor in a grand procession.
The Haram was first paraded on the sacred four Mada streets at Tirumala before transported to Tiruchanoor temple with VGO Sri Bali Reddy and Srivari temple Peshkar Sri Srihari in attendance.
TTD JEO RECEIVED SRIVARI LK HARAM
The Srivari Lakshmi Kasula Haram was brought in a vehicle amidst tight security to Pasupu Mandapam at Tiruchanoor where the TTD EO Sri AV Dharma Reddy ceremonially handed over the Srivari precious ornament to the TTD JEO Sri Veerabrahmam.
Later on after special pujas and amidst mangala vaidyam the Haram was taken inside Sri Padmavati temple and adorned to the presiding deity inside the sanctum.
DyEO Sri Lokanatham, Agama Advisor Sri Srinivasacharyulu, temple Archaka Sri Babu Swami, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Seshagiri, temple inspector Sri Damu and other officials were present.
తిరుమలలో లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
పంచమితీర్థం నాడు విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం
తిరుమల, 2022 నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురు, శుక్రవారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని గురువారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, నవంబర్ 28న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గురువారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ జరగనుందని, ఇందుకోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని ఆలయ నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు.
తిరుమలలో జరిగిన కార్యక్రమంలో విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి పాల్గొన్నారు.
తిరుచానూరులో శ్రీవారి లక్ష్మీకాసులహారం స్వీకరించిన టిటిడి జెఈవో
అనంతరం తిరుమల నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కాసులహారాన్ని జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి అలంకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.