LAKSHMI VENKATESWARA SWAMY TEPPOTSAVAM HELD GRANDLY _ తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి విహారం
Kadapa / Tirupati, April 30, 2026: As part of the Teppotsavam at Devuni Kadapa, Sri Lakshmi Venkateswara Swamy along with Sridevi and Bhudevi gave darshan to devotees on Thursday.
The deity was taken on a float ride with five rounds in the temple tank, blessing devotees.
Special rituals were performed and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి విహారం
తిరుపతి, 2026 ఏప్రిల్ 30: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం స్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



