LIBRARIES ARE KNOWLEDGE TREASURES TTD JEO (H&E) _ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు – టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి
PARTICIPATES IN LIBRARY WEEK CELEBRATIONS
Tirupati,15 November 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi called upon the students to inculcate the habit of visiting the Library to explore new knowledge and valuable information.
Addressing the Library Awareness held at SVETA Bhavan as a part of the National Library Week Celebrations call given by the Union Government from November 14-22 she urged the students to make visit to libraries as a must habit in their daily job chart.
She urged teachers to instruct students on how to verify and locate required books in libraries.
Renowned speaker Smt Ananta Lakshmi, CAuO Sri Sesha Sailendra, DEO Sri Bhaskar Reddy, SVETA Director Smt Prasanthi were also present.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు – టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి
– గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన
తిరుపతి, 2023 నవంబరు 15: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, టీటీడీ పాఠశాలల విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయాలను సందర్శించి కొత్త విషయాలను నేర్చుకోవాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి కోరారు. కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ గ్రంథాలయాల్లో మనకు తెలియని కొత్త విషయాలను చాలా నేర్చుకోవచ్చని, ప్రతి ఒక్కరు గ్రంథాలయాలకు వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. టీటీడీ పాఠశాలల విద్యార్థులకు వారానికి ఒకరోజు లైబ్రరీ క్లాస్ ప్రారంభించాలని, ఇందులో ఒక గంట సేపు విద్యార్థులు గ్రంథాలయంలో గడిపేలా చూడాలని చెప్పారు. గ్రంథాలయంలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి పుస్తకాలను ఎలా వెతకాలి అనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్వేత భవనంలో గల కేంద్ర గ్రంథాలయంలో వేదాలు, పురాణాలు, సాహిత్యం, చిన్నపిల్లల కథల పుస్తకాలు, పోటీ పరీక్షలు పుస్తకాలు తదితర ఆసక్తికరమైన అనేక పుస్తకాలు ఉన్నాయని, విద్యార్థులు తరచూ సందర్శించి జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు.
అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ధార్మిక ప్రవచనకర్త డా.సి.అనంతలక్ష్మి ధార్మిక, వ్యక్తిత్వ వికాస విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ముందుగా శ్వేత భవనం ప్రాంగణంలో గల సరస్వతి అమ్మవారి విగ్రహానికి జెఈవో పూజలు నిర్వహించారు. అనంతరం శ్వేత భవనంలో గల కేంద్ర గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ధార్మిక పుస్తక ప్రదర్శనను జెఈవో సందర్శించారు. అనంతరం విద్యార్థులకు ధార్మిక పుస్తకాల కిట్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సిఏవో శ్రీ శేషశైలేంద్ర, విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్కర్‌రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.