LORD CHILLS ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

TIRUPATI, 14 FEBRUARY 2026: Sri Kalyana Venkateswara as Navanitha Krishna chilled on Chandraprabha Vahanam on the seventh day evening on Saturday.

The devotees had a soothing experience on witnessing the lord on a pleasant Moon carrier.

The devotees danced with utmost devotion in front of Vahanam to the rhythmic beats of Kerala Dolu.

Temple Special Officer Dr.T.Ravi, Spl Grade DyEO Smt Varalakshmi, Kankanabhattar Sri Balaji Rangacharyulu, AEO Sri Gopinath and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

చంద్రప్రభ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2026 ఫిబ్రవరి 14: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శ‌నివారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.

చంద్ర‌ప్రభ వాహనంసకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

వాహనసేవలో ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.