LORD GLIDES ON MUTYAPU PANDIRI_ ముత్య‌పు పందిరి వాహ‌నంపై శ్రీ వేణుగోపాల‌స్వామివారి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Tirumala, 2 Oct. 19: Sri Malayappa Swamy as Venugopala Krishna enthralled the pilgrims on Mutyapu Pandiri Vahanam. 

The pleasant evening on Wednesday witnessed Lord flanked by His two consorts on pearl canopy. 

The artistes performing Yakshagana,  drum beats,  Manipuri Nrutyam stood as a special attraction during the procession.

The devotees were charmed by the majesty of Sri Malayappa along with Sridevi and Bhudevi on the shining Mutyapupandiri vahanam.

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ముత్య‌పు పందిరి వాహ‌నంపై శ్రీ వేణుగోపాల‌స్వామివారి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమ‌ల‌, 2019 అక్టోబరు 02:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడ‌వ‌ రోజైన బుధ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు  శ్రీ వేణుగోపాల‌స్వామివారి అలంకారంలో ముత్య‌పు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
 
ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకి మూడో రోజు రాత్రి ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

 కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.