LORD GOVINDA SHINES ON CHINNA SESHA VAHANAM _ చిన్నశేషుడిపై వెలసిన శ్రీ గోవిందుడి దివ్యమహిమ
TIRUPATI ECHOES WITH GOVINDA CHANTS
Tirupati, May 24, 2026: On the second day of the annual Brahmotsavams at Sri Govindaraja Swamy Temple, Lord Govindaraja Swamy blessed devotees on Chinna Sesha Vahanam on Sunday morning.
The Vahana Seva was held grandly from 7am to 9am amidst Vedic chants, mangala vadyams, kolatams and bhajans. Devotees offered Harathis and had divine darshan of the Lord.
Later, Snapana Tirumanjanam was performed in Kalyana Mandapam with milk, curd, honey, sandalwood and fruit juices to the utsava deities.
Unjal Seva will be held from 5.30pm to 6pm, followed by Hamsa Vahanam Seva from 7pm to 9pm.
TTD officials, Jeeyars and a large number of devotees participated in the festivities.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నశేషుడిపై వెలసిన శ్రీ గోవిందుడి దివ్యమహిమ
గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి మాడవీధులు
తిరుపతి, 2026 మే 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. ముందుగా గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామసంకీర్తనలతో మాడవీధులను భక్తిరసమయం చేశాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి చిన్నశేష వాహనం దివ్యశోభను సంతరించుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి గోవిందుడిని దర్శించుకొని పరవశించారు.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడు “శేషి”, జగత్తు “శేషభూతం”గా భావించబడుతుంది. ఈ శేషశేషి తత్వానికి ప్రతీకగా చిన్నశేష వాహనం నిలుస్తుంది. చిన్నశేష వాహనసేవను దర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
అనంతరం ఉదయం 10 గంటల నుండి కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటల నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌సేవ జరగనుండగా, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, ప్రముఖులు,













