HANUMANTHA VAHANAM OBSERVED _ హనుమంత వాహనంపై గోవిందుడి కటాక్షం
TIRUPATI, 31 MAY 2023: As a part of the ongoing annual brahmotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati, Hanumanta Vahana Seva observed on Wednesday morning.
Sri Govinda Raja took out a celestial ride along four mada streets on Hanumantha Vahanam between 7am and 9am to bless His devotees.
Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Shanti, Kanakana Bhattar Sri Srinivasa Deekshitulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హనుమంత వాహనంపై గోవిందుడి కటాక్షం
తిరుపతి, 2023 మే 31: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం గోవిందుడు వరద హస్తంతో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం 9-30 గంటల నుండి 10-30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహన సేవలు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణభట్టర్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.