సూర్యప్రభ వాహనంపై గోవిందుడి వైభవం

సూర్యప్రభ వాహనంపై గోవిందుడి వైభవం

తిరుపతి, 2023 జూన్ 01: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.

వాహన సేవ అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబరి నీళ్లు పసుపు ,చందనాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, కంకణభట్టార్ శ్రీ ఏపి శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.