LORD MALAYAPPA SHINES AS NAVANEETA KRISHNA ON CHANDRA PRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 22 October 2020: On the evening of seventh day of Srivari Navaratri Brahmotsavams Sri Malayappa Swamy blessed devotees from celestial ride on Chandra Prabha Vahanam in Navateeta Krishna Alankaram.
The TTD is conducting all events of the Navaratri Brahmotsavam in Ekantham as per Covid guidelines issued by State and central governments for the festive season.
Legends say that Chandra or the moon stands for highlighting medicinal values in all living beings including plants. Chandra is described as Lord Vishnu, the invisible architect who found remedies for all ailments of persons and plants.
The Bhagavat Geeta also mentions “Nakshatrana Aham Shashi” (I am the moon in the constellation) as the Lord referred Himself to Moon. The Chandra Prabha Vahanam signifies that its very sight will provide soothing relief to devotees from physical and mental worries.
Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Telangana High Court Judge Sri Amarnath Goud, TTD EO Dr KS Jawahar Reddy, Deputy Speaker Sri Kona Raghupathi, Additional EO Sri AV Dharma Reddy, Board members Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, Sri Sampath Ravinarayana, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
2020 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2020 అక్టోబరు 22: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
కాగా, బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీ అమర్‌నాథ్ గౌడ్, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతిరెడ్డి, డా. నిశ్చిత, శ్రీ చిప్పగిరి ప్రసాద్, శ్రీ గోవిందహరి, శ్రీ డిపి.అనంత, శ్రీ సంపత్ రవి నారాయణ, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి, పేష్కార్ శ్రీ జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.