LORD VEDANARAYANA BLESSES DEVOTEES ON SIMHA VAHANAM _ సింహ వాహనంపై యోగ నరసింహుని  అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి కటాక్షం  

Tirupati, May 03, 2026: On the third day of the Brahmotsavams at Nagalapuram, Lord Vedanarayana appeared in Yoga Narasimha Alankaram on Simha Vahanam on Sunday morning, blessing devotees.

Devotional groups performed bhajans and kolatams, while the procession was held amidst traditional music. Devotees offered harathi and had darshan.

Later, Snapana Tirumanjanam was performed to the Lord and Goddess with milk, curd, honey, sandalwood, turmeric, and coconut water.

Temple officials, priests, and a large number of devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

సింహ వాహనంపై యోగ నరసింహుని  అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి కటాక్షం  

తిరుపతి,2026 మే 03: నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం  యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. 

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది.

అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. 

 వాహ‌న‌సేవ‌లో ఆలయ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ శ్రీ‌నివాసులు, శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చకులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది