LOST BAG RETURNED TO DEVOTEE THROUGH COMMAND CONTROL CENTRE EFFORTS _ కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో భక్తునికి తప్పిపోయిన బ్యాగు అప్పగింత

Tirumala, June 20, 2026: A devotee from Telangana, Sri Vanga Mallesh Goud, who accidentally left his bag at the Alipiri checkpoint scanner, lodged a complaint at the Tirumala Command Control Centre at 11.30 pm.

Acting swiftly, the Command Control Centre staff traced the vehicle (TG 07 AD 0269) that had inadvertently taken the bag and located it at Balaji Guest House No.4 at 3.30 am with the help of CCTV footage.

The bag was recovered and handed over to the devotee after verification. All belongings, including 50 grams of gold, were found intact.

Expressing gratitude to the Command Control Centre officials and staff, the devotee appreciated their prompt response and dedicated service. He also recorded his appreciation in the Command Control Centre feedback register.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో భక్తునికి తప్పిపోయిన బ్యాగు అప్పగింత
 
తిరుమల, జూన్ 20, 2026 ; తిరుమలకు దర్శనార్థం వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు శ్రీ వంగ మల్లేష్ గౌడ్ అలిపిరి చెక్‌పాయింట్‌ (స్కానర్) వద్ద తన బ్యాగును అనుకోకుండా మరచిపోయారు. వెంటనే ఆయన తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయగా, సిబ్బంది సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం (TG 07 AD 0269)ను గుర్తించి, తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో భక్తునికి తప్పిపోయిన బ్యాగు అప్పగింత

తిరుమల, జూన్ 20, 2026: తిరుమలకు దర్శనార్థం వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు శ్రీ వంగ మల్లేష్ గౌడ్ అలిపిరి చెక్‌పాయింట్‌ (స్కానర్) వద్ద తన బ్యాగును అనుకోకుండా మరచిపోయారు. వెంటనే ఆయన రాత్రి 11:30 గంటలకు

తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు.

కమాండ్ కంట్రోల్ సిబ్బంది వాహనాన్ని ట్రేస్ చేసి, తెల్లవారుజామున 3:30 గంటలకు బాలాజీ గెస్ట్ హౌస్ నెం.4 వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం (TG 07 AD 0269)ను గుర్తించారు.

వాహనంలోని  శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని, స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు. 

అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని అన్ని వస్తువులతో పాటు 50 గ్రాముల బంగారం కూడా యథాతథంగా ఉండటంతో, బ్యాగును శ్రీ వంగ మల్లేష్ గౌడ్‌కు అప్పగించారు.

ఈ సందర్భంగా భక్తుడు తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది చొరవ, అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో స్పందించి తిరుమలకు వచ్చే భక్తులకు భరోసా కల్పించారని కమాండ్ కంట్రోల్ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో భక్తుడు ప్రశంసలు కురిపించారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

దీనితో శ్రీ మల్లేష్ గౌడ్ రాత్రి 11:30 గంటలకు తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది వాహనాన్ని ట్రేస్ చేసి, తెల్లవారుజామున 3:30 గంటలకు బాలాజీ గెస్ట్ హౌస్ నెం.4 వద్ద ఆ వాహనంలోని భక్తులను గుర్తించారు.
 
వారిలో శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని, స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు.
 
అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని అన్ని వస్తువులతో పాటు 50 గ్రాముల బంగారం కూడా యథాతథంగా ఉండటంతో, బ్యాగును శ్రీ వంగ మల్లేష్ గౌడ్‌కు అప్పగించారు.
 
ఈ సందర్భంగా భక్తుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవ, అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు.
 
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది