MAHA SAMPROKSHANA FETE AT VONTIMITTA TEMPLE _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 మార్చి 06: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ మరియు కుంభాభిషేకం కార్యక్రమాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఉదయం 10.15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
టీటీడీ ఆగమ సలహాదారులు మరియు ప్రధాన కంకణబట్టర్ శ్రీ రాజేష్ స్వామి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 7.30 గంటలకు భగవత్పుణ్యాహము, అగ్ని మధనము, యాగశాలలో వైధిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివార కుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమములు, శ్రీ మద్రామాయణ హవన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటలకు చతుస్థానార్చనము, సహస్ర కళాశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమములు, పూర్ణాహుతి సాత్తుమొర జరగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.