MAHA SAMPROKSHANAM IN RAMPACHODAVARAM ON MAY 22 _ మే 17న రంపచోడవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ

TIRUPATI, 16 MAY 2023: The Maha Samprokshanam festivities in Sri Venkateswara temple at Rampachodavaram in Alluri Seetaramaraju district will commence on May 17 with Ankurarpanam and conclude on May 22.

 

On the last day the Maha Samprokshanam will be observed in the auspicious Mithuna Lagnam between 9am and 9:30am and devotees will be provided darshan from 10am onwards.

 

On the same day evening at 5pm Srivari Kalyanam will be observed.

 

TTD has made elaborate arrangements for the religious event.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  
మే 17న రంపచోడవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ
 
– మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
 
తిరుపతి 16 మే 2023: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు మే 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. మే 22 వ తేదీ మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
 
కాగా, మే 17 వతేదీ సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం చేపడతారు.
 
మే 22న ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు మిథున లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.