MAHA SHANTI ABHISHEKAM HELD _ శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా మహాశాంతి అభిషేకం

TIRUPATI, 22 JUNE 2022: As a part of ongoing Mahasamprokshanam festivities Mahashanti Abhishekam was held on Wednesday evening at Sri Vakulamata temple in Patakalva.

 

Minister of AP Sri P Ramachandra Reddy participated accompanied by TTD Board member Sri Ashok Kumar.

 

Among others MPs Sri Mithun Reddy, Sri Reddeppa Reddy, ZP chief Sri Srinivasulu, MLA Sri Srinivasulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

శ్రీ వకుళ మాత అభిషేక సేవలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి దంపతులు

తిరుపతి 22 జూన్ 2022: తిరుపతి సమీపంలోని పాత కాల్వ ( పేరూరు బండ) మీద నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారికి బుధవారం సాయంత్రం జరిగిన అభిషేక సేవలో రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా మహాశాంతి అభిషేకం జరిపారు.

టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య, పార్లమెంటు సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి , శ్రీ రెడ్డెప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే శ్రీ జంగాల పల్లి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది