MAHA SIVA RATRI IN KT ON MARCH 1 _ శ్రీకపిలేశ్వరాలయంలో మార్చి 1న ఏకాంతంగా మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు

Tirupati, 27 Feb. 22: In connection with Maha Sivaratri on March 1, the Kapileswara Swamy temple in Tirupati is getting ready to host some special rituals in Ekantam due to Covid restrictions.

Rudrabhishekam will be performed to the presiding deity between 2:30 and 4:30am. There will be Bhogi Teru followed by snapanam in the morning between 9am and 10am. Nandi Vahanam takes place between 6pm and 10pm.

Devotees will be allowed for Sarva Darshanam between 5:30am and 12 midnight on March 1.

The Lingodbhavakala Abhishekam will be performed between midnight of March 1 (12am) till 4am on March 2.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో మార్చి 1న ఏకాంతంగా మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు

తిరుపతి, 2022 ఫిబ్రవరి 27: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం ఘ‌నంగా జ‌రుగ‌నుంది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు శివ‌రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

మహాశివరాత్రి సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుండి 8 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉదయం 5.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ ఆలయంలోనే జరుపుతారు.

మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.