MAHASIVARATRI CELEBRATIONS BEGINS AT SRI SESHACHALA LINGESHWARA SWAMY TEMPLE _ శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
Tirupati, 14 February 2026: The auspicious Mahasivaratri celebrations began on Saturday at Sri Seshachala Lingeshwara Swamy Temple in Kandulavaripalli, Chandragiri Mandal.
As part of this, Kalasha Sthapana, Ganapati, Navagraha, Rudra, Durga Homams will be performed at 3 pm on Saturday.
On the occasion of Mahashivratri on February 15, Abhishekam will be performed on Sri Vigneshwara Swamy, Sri Subramanya Swamy, Sri Anjaneya Swamy, and Sri Umamaheswara Swamy in the early morning from 4.30 to 5.30 am.
Ekadasa Rudrabhishekam will be performed on Sri Seshachala Lingeshwara Swamy from 5.30 to 7 am. Abhishekam will be performed on Sri Seshachala Lingeshwara Swamy and Sri Nandeeshwara Swamy from 5.30 to 6.30 pm. Harikatha and devotional music programs will be organized from 7 pm to 12 am.
On February 16, the Mahanyasapurvaka Rudrabhishekam will be organized from 12.10 am to 4 am. After that, the celestial wedding ceremony will begin at 9.30 am. The Gramotsavam will be organized at 6 pm.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2026 ఫిబ్రవరి 14: చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 3 గంటలకు కలశ స్థాపన, గణపతి, నవగ్రహ, రుద్ర దుర్గ హోమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి అభిషేకం జరుగనుంది. ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామి వారికి, శ్రీ నందీశ్వరస్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుండి 12 గంటల వరకు హరికథ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 16న తెల్లవారుజామున 12.10 నుండి ఉదయం 4 గంటల వరకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు.
