MAIDEN MEET OF GOVINDUNIKI GOPATHAKAM COMMITTEE HELD _ గోసంరక్షణ కోసం నూతనంగా గోవిందుని గోపథకం ప్రాజెక్టు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
TIRUMALA, 23 JULY 2021: The maiden meeting of the Govinduniki Gopathakam Committee was held in Tirumala on Friday.
Headed by TTD EO Dr KS Jawahar Reddy at Annamaiah Bhavan, the meeting discussed elaborately on how to promote desi cows, prepare prasadams to Tirumala and TTD temples using Desi Cow products and other related subjects.
Briefing the deliberations to the media later the EO said, following the Board Resolution, this Committee led by TTD Additional EO was constituted and it’s meeting was held for the first time.
He said, the experts in the Committee, after thoroughly studying many Gosalas across the country, have suggested on what products shall be prepared out of Panchagavya and how best they can be used in organic farming and in other important activities of our daily routine to lead a healthy lifestyle. They also suggested on how to take the significance of these Panchagavya products into masses and bring awareness among people on the importance of Desi Cow products.
The EO said the Committee will soon come out with a concrete report with useful suggestions that would benefit the society in future.
CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SV Gosala Director Dr Harnath Reddy, Committee members Sri K Siva Kumar, Sri M Vijayarama Kumar, Sri M Sivaram, Dr Vijayakumara Sharma, Dr T Padmakara Rao, Sri G Nagender Reddy, Dr Umashankar Mahapatro, Dr K Siva Sagar Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గోసంరక్షణ కోసం నూతనంగా గోవిందుని గోపథకం ప్రాజెక్టు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, 2021 జులై 23: సనాతన ధర్మంలో ఎంతో వైశిష్ట్యం గల గోవుల సంరక్షణ కోసం నూతనంగా గోవిందుని గోపథకం ప్రాజెక్టును ప్రారంభించామని, త్వరలో విధివిధానాలు తెలియజేస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. గోవిందుని గోపథకం ప్రాజెక్టుకు సంబంధించి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి నేతృత్వంలో టిటిడి బోర్డు నిష్ణాతుల కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మొదటి సమావేశం శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వారి అనుభవాలను ఈవోకు వివరించారు.
సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత పదార్థాలతో స్వామివారి నైవేద్యం, ప్రసాదం తయారు చేస్తామన్నారు. పంచగవ్యాలతో తయారయ్యే ఉత్పత్తుల ద్వారా సమాజంలో గోవు ప్రాముఖ్యతను పెంచవచ్చన్నారు. గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు రాబట్టవచ్చని చెప్పారు. కమిటీ సభ్యులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని, వారి సూచనలు నిర్మాణాత్మకంగా, సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు శుక్ర, శనివారాల్లో గోశాలలను సందర్శించి పలు అంశాలపై అధ్యయనం చేస్తారని చెప్పారు.
ఈ సమావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, కమిటీ సభ్యులైన బోర్డు మాజీ సభ్యులు శ్రీ కె.శివకుమార్, శ్రీ ఎం.విజయరామకుమార్, డాక్టర్ ఎం.శివరామ్, డాక్టర్ జి.విజయకుమార శర్మ, డాక్టర్ టి.పద్మాకరరావు, శ్రీ జి.నాగేందర్‌రెడ్డి, డాక్టర్ ఉమాశంకర మహాపాత్రో, డాక్టర్ కె.శివసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.