MAJESTIC APPEARANCE OF LORD SRI RAMACHANDRA IN SHIVA DHANURBHANGA ALANKARAM _ శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం
Vontimitta, April 01, 2026: As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple in Vontimitta, on the sixth day, Wednesday morning, Lord Sri Kodandarama Swamy appeared in the divine Shiva Dhanurbhanga Alankaram, delighting devotees with His majestic presence.
The procession of the Lord commenced grandly from 7:30 AM. Accompanied by Kerala drums, traditional chekka bhajans by devotional groups, and colorful kolatam performances, the procession proceeded in a vibrant and festive atmosphere amidst auspicious musical instruments. Devotees offered camphor haratis at every step and had darshan of the Lord.
The Shiva Dhanurbhanga Alankaram symbolizes the sacred episode from the Swayamvara, where Lord Sri Rama breaks Lord Shiva’s bow and marries Goddess Sita. On the day of the celestial wedding of Sita and Rama, the Lord blessed devotees in this divine adornment.
Deputy Executive Officers Smt. Prasanthi and Sri Siva Prasad, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen, and others participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం
ఒంటిమిట్ట, 2026 ఏప్రిల్ 01: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది.
ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓలు శ్రీమతి ప్రశాంతి, శ్రీ శివప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.











