MAJESTIC KAISIKA DWADASI FETE AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం
MAJESTIC KAISIKA DWADASI FETE AT SRIVARI TEMPLE
SRI URGA SRINIVASA MURTHY AND CONSORTS BLESS DEVOTEES ON MADA STREETS
Tirumala,24 November 2023: The auspicious Kaishika Dwadasi (Uttana Dwadasi) festival was observed in a grand manner at Srivari temple during the early hours of Friday.
As a part of this unique fete, Sri Urga Srinivasa Murthy along with His consorts Sridevi and Bhudevi blessed devotees all along the four Mada streets.
Titled Venkatturaiwar and Snapana Bera, the idol of Sri Ugra Srinivasa Murthy was paraded before sunrise on the Kaisika Dwadasi day which happens only once a year.
Thereafter the utsava idols are seated in Asthana Mandapam at Bangaru Vakili with Purana Pathanam by Archakas.
LEGEND
Legend says that Kaisika Dwadasi is an auspicious fete observed in all Sri Vaishnava Shrines. The celebrations are as per specifics mentioned in 82 shlokas of Sri Varaha Perumal Kaisika Puranam
Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami and Sri Sri Sri Chinna Jeeyarswami, TTD Chairman Sri Bhumana Karunakar Reddy, EO Sri AV Dharma Reddy, Board members Sri Subbaraju, Sri Yanadaiah, Sri Saurabh Bohra, and other temple officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం
– మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి దర్శనం
తిరుమల, 2023 నవంబరు 24 ; కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.45 నుండి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ సుబ్బరాజు, శ్రీ యానాదయ్య, శ్రీ సౌరబ్ బోరా, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.