MAJOR DONATIONS TO TTD _ టీటీడీకి భారీ విరాళాలు
Tirumala, 31 August 2025: Hyderabad-based RSB Retail India Limited has donated Rs. 2,92,91,840 (Rs. 2.93 crore) to the TTD BIRRD Trust on Sunday.
Similarly, RS Brothers Jewellers Private Limited has donated Rs.1.10 crore to the TTD BIRRD Trust.
The Managing Directors of these companies—Sri Potti Venkateswarlu, Sri Seerna Rajamouli, Sri T. Prasada Rao, and Smt. Potti Malathi Lakshmi Kumari—handed over the donation DDs to TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam inside the Srivari temple.
Meanwhile, a devotee Sri J. Ramanjaneyulu of Narsaraopet has donated Rs. 10 lakh to the Sri Venkateswara Annaprasadam Trust.
టీటీడీకి భారీ విరాళాలు
తిరుమల, 2025 ఆగస్టు 31: హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది.
అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు, శ్రీ సీర్న రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు.
కాగా నర్సారావు పేటకు చెందిన శ్రీ జె.రామాంజనేయులు శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


