MAJOR STEP TOWARDS CONSTUCTION OF SRIVARI TEMPLE AT GUWAHATI _ గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముందడుగు
TTD TAKES POSSESSION OF 10.33 ACRES OF LAND
NEW CHAPTER FOR SANATANA DHARMA IN NORTHEAST INDIA
BHOOMI PUJA TO BE HELD SOON: TTD CHAIRMAN SRI B.R.NAIDU
Tirupati, June 09, 2026: In a significant development, TTD has officially taken possession of 10.33 acres of land allotted by the Assam Government for the construction of a Sri Venkateswara Swamy Temple in Guwahati.
The land, located in Sonapur Circle of Kamrup District, Assam, was allotted as part of the initiative to establish Srivari temples in state capitals across the country, following the vision of Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu.
TTD Chairman Sri B.R. Naidu and senior officials had earlier held discussions with Assam Government representatives regarding the project. The Chief Minister of Andhra Pradesh and the TTD Trust Board also extended their support through official communications.
On Tuesday, the Assam Metropolitan Deputy Commissioner handed over the Land Possession Certificate to TTD Estate Officer Smt. Suvarnamma and Executive Engineer Sri Surendra Reddy.
Sri B.R. Naidu said that Bhoomi Puja for the temple construction will be performed shortly. He expressed happiness that the initiative gained momentum through the special efforts of Chief Minister Sri N. Chandrababu Naidu.
He stated that the proposed Srivari Temple in Assam would become a historic milestone in spreading Sanatana Dharma and spiritual awareness across Northeast India.
TTD Chairman Sri B.R. Naidu and EO Sri Muddada Ravi Chandra conveyed their gratitude to Assam Chief Minister Sri Himanta Biswa Sarma and the Assam Government for their valuable support.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముందడుగు
10.33 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న టీటీడీ
ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం
త్వరలో భూమిపూజ – టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుపతి, 2026 జూన్ 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ మంగళవారం అధికారికంగా స్వాధీనం చేసుకుంది.
అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఈ భూమిని అస్సాం ప్రభుత్వం కేటాయించింది. గతంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ పాలకమండలి కూడా అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు.
ఈ నేపథ్యంలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ, ఈఈ శ్రీ సురేంద్ర రెడ్డికి అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ మంగళవారం ల్యాండ్ పొజెషన్ సర్టిఫికెట్‌ను అందజేశారు.
త్వరలో భూమిపూజ
గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమై సఫలమవడం ఆనందదాయకమన్నారు.
అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారికి, అస్సాం ప్రభుత్వానికి టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర టీటీడీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
