MAKE A GRAND SUCCESS OF PANCHAMI THEERTHA FETE- TTD JEO _ అన్ని విభాగాల సమన్వయంతో పంచమితీర్థం విజయవంతం చేయాలి – టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

COORDINATE ALL TTD DEPARTMENTS FOR DEVOTEES ARRANGEMENTS

 

Tirupati,23, November: TTD JEO Sri Veerabrahmam on Wednesday called upon all TTD wings to work cohesively and coordinate all efforts to make a grand success of the celestial Panchami thirtha fete, a significant event of  Sri Padmavati Brahmotsavam, slated for Thursday.

 

Speaking after a review meeting on arrangements with local police, TTD and panchayat officials etc, the TTD JEO said a massive crowd of devotees was anticipated as the celestial program was held in public after a gap of two years of covid restrictions and to provide Koneru bath for all devotees.

 

Among others he said queue lines were being organised for the first time from Pudi road, Nava Jeevan eye hospital, and high school, and food counters set up at three locations from Nov. 27 night till Nov.28 night to provide snacks. Drinking water beside toilets. All five officials and staff stationed at five sectors in all three regions from 27th evening.

 

He directs officials to complete power generators and toilets, temporary sheds to change dress, barricades, parking lots etc in coordination with police and local panchayat for sanitisation workers by the evening of 24th.

District SP Sri Parameswar Reddy said nearly 2500 policemen deployed for Panchami thirtha duty, drinking water and Anna Prasadam arrangements at parking lots and coordinated efforts by police and TTD vigilance. 

 

He said anyone wanting to perform anna danam, they should take permission in order to prevent future food poisoning 

 

The JEO and others also inspected the three regions for making arrangements and also gave valuable suggestions.

 
SVBC CEO Sri Shanmugha Kumar, TTD CE Sri Nageswara Rao, Additional SPS Sri Kulasekara, Smt Supraja, Smt Vimala Kumari, DyEO Sri Lokanatham and other DyEOs, DSPS etc were also present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్ని విభాగాల సమన్వయంతో పంచమితీర్థం విజయవంతం చేయాలి – టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 23 నవంబరు 2022: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పంచమితీర్థం అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం పిలుపునిచ్చారు.

పంచమితీర్థం ఏర్పాట్లపై తిరుచానూరు అన్నప్రసాద భవనంలో బుధవారం సాయంత్రం ఆయన జిల్లా పోలీసు, టీటీడీ, పంచాయతీ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, రెండు సంవత్సరాల తరువాత పంచని తీర్థం కార్యక్రమం పద్మసరోవరం ( కోనేరు)లో నిర్వహిస్తున్నందువల్ల పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రించి అందరికీ కొనేరులో పవిత్ర స్నానం చేసే అవకాశం కల్పించాలని చెప్పారు. ఇందుకోసం తొలిసారిగా పూడి మార్గం, నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు వద్ద భక్తులను నిలిపిఉంచే ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మూడు చోట్ల భక్తుల కోసం 27వ తేదీ రాత్రి, 28వ తేదీ ఉదయం అల్పాహారం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించే పనులు జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించడం కోసం ఈ మూడు ప్రాంతాలను ఐదు సెక్టార్లుగా విభజించి 27వ తేదీ సాయంత్రం నుంచే అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని జేఈవో వివరించారు. 25వ తేదీ సాయంత్రానికి ఈ మూడు చోట్ల విద్యుత్, జనరేటర్ , మరుగుదొడ్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని వారు సూచించిన విధంగా బ్యారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. టీటీడీతో పాటు, తిరుచానూరు పంచాయతీ నుంచి అవసరమైనంత మంది పారిశుధ్య సిబ్బందిని తీసుకుని మరుగు దొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ, పంచమితీర్థం రోజుకు 2500 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం నియమిస్తున్నాని చెప్పారు. పార్కింగ్ స్థలాల్లో కూడా అవసరమైన వారికి తాగునీరు, ఆహారం అందించేలా ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. డ్యూటీలో ఉండే సిబ్బందికి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో టీటీడీ విజిలెన్స్ అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని కోరారు. దీనివల్ల ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చన్నారు.

అనంతరం వీరు రద్దీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మూడు ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, అదనపు ఎస్పీలు శ్రీ కులశేఖర్, శ్రీమతి సుప్రజ, శ్రీమతి విమల కుమారి, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంతో పాటు పలువురు డిప్యూటీ ఈవోలు, డిఎస్పీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది