MALAYAPPA DONS RAMA-KRISHNA-GOVINDA ALANKARAM _ సూర్యప్రభ వాహనంపై రామకృష్ణ గోవింద అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 24 September 2023: On the seventh day of ongoing annual Brahmotsavams at Tirumala on the bright sunny morning on Sunday, Sri Malayappa Swamy blessed the devotees on Surya Prabha vahanam, depicting three incarnations, Rama Krishna Govinda Alankaram.
Legend says that Sun God, the key architect of life, is dragged by a chariot of seven horses with Anura as the charioteer. Sun God is symbolically represented for the blessing of good health. It is the common belief that the Darshan of Sri Venkateswara on Surya Prabha vahanam would provide a long life, good health and prosperity and hence He is worshipped as Suryanarayana.
The Tirumala deity rode atop a vehicle adorned by Surya, the Sun God, representing His three incarnations of Treta-Dwapara-Kali yugas in His unique Rama Krishna Govinda Alankaram.
Devotees were mesmerized to see the divine charm of Lord in a different Alankaram wearing the Kodanda, Flute, Gadha, Conch and Disc as Ram Krishna Govinda gliding atop Surya Prabha vahanam paraded along four mada streets with majesty.
The TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై రామకృష్ణ గోవింద అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2023 సెప్టెంబరు 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు. శ్రీ మలయప్పస్వామివారు శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో భక్తులకు దర్శనం ఇచ్చారు.
సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి సీతా రెడ్డి, శ్రీ అశ్వర్థనాయక్, శ్రీ సుబ్బరాజు, శ్రీ శేషుబాబు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.