MALAYAPPA SHINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం

TIRUMALA, 21 OCTOBER 2023: Sri Malayappa Swamy shined brightly on Suryaprabha Vahanam on Saturday morning.

The seventh day of the ongoing Navaratri Brahmotsavams witnessed Suryprabha Vahanam, the Sun carrier to bless His devotees along the four mada streets.

Sri Malayappa was decked with a mammoth bright red ixora flowers garland which enhanced the charm and richness of the processional deity.

In the entire constellation, Sun has a significant role and is believed to be the chief source of life on earth.

Both the pontiffs of Tirumala, TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present. Lord Sri Maha Vishnu Himself dons the avatara of Surya Narayana to save His devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం

తిరుమల, 2023 అక్టోబరు 21: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.