MALAYAPPA VISITS VIKHANASA SANNIDHI _ శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala, 10 August 2025: On the succeeding day of Sravana Pournami, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi visited Sri Vikhanasa Maharshi Sannidhi located on North Mada street in Tirumala on  Sunday evening.

Srivari Temple Paru Pattedhar Sri Bala Subramanyam, Sri Vikhanasa Trust Secretary, Sri Ganjam Prabhakaracharyulu and other Temple officials participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమ‌ల‌, 2025 ఆగ‌స్టు 10: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆదివారం ఉత్త‌ర మాడ వీధిలో గ‌ల శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి శ్రావణ పౌర్ణమి నాడు జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు స్వామి, అమ్మ‌వార్లు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో వైఖాన‌స ఆగ‌మం ప్ర‌కారం నిత్య‌కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రాన్ని శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి ర‌చించారు.

సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస్థానం నిర్వ‌హించి నివేద‌న చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆలయ పారు పత్తేదార్ శ్రీ బాల సుబ్రహ్మణ్యం, శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.