MAREECHA MAHARSHI JAYANTI OBSERVED _ ఘనంగా మరీచి మహర్షి జయంతి
Tirumala, 01 July 2025: The Jayanti celebrations of Sri Mareecha Maharshi were conducted in a grand manner at Asthana Mandapam in Tirumala on Tuesday evening.
The event was jointly organized by the TTD Alwar Divya Prabandha Project and Sri Vaikhanasa Divya Siddhanta Vivardhini Sabha.
Speaking on the occasion, scholars highlighted that Sri Mareecha Maharshi, a distinguished disciple of Sri Vikhanasa Maharshi the pioneer of the Vaikhanasa Shastra authored the sacred text known as ”Vimanarchana Kalpam”.
This text serves as the authoritative guideline for rituals and worship methods followed in the Srivari temple.
It is specifically mentioned that the ritual of “Ashtadala Padapadmaradhana Seva” performed to Sri Venkateswara Swamy is based entirely on the guidelines as prescribed in this revered scripture.
The event witnessed the participation of eminent Vaikhanasa Agama scholars including Sri Ganjam Prabhakaracharyulu, TTD Vaikhanasa Agama Advisors Sri Archakam Ananthasayanam Dikshitulu, Khadri Narasimhacharyulu, Sri P.K. Varadan Bhattacharyan, Professor Sri Ganjam Ramakrishna from SV Vedic University, Professor Sri Tanuj Vishnuvardhan from National Sanskrit University, and students from Dharmagiri Veda Vijnana Peetham.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా మరీచి మహర్షి జయంతి
తిరుమల, 2025 జూలై 01: శ్రీ మరీచి మహర్షి జయంతి కార్యక్రమం మంగళవారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది.
టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్ల చిత్ర పటాలకు, మరీచి మహర్షి చిత్ర పటానికి మంగళ హారతులు సమర్పించారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ వైఖానస శాస్త్రానికి మూలపురుషుడైన శ్రీ విఖనస మహర్షి శిష్యుడైన శ్రీ మరీచి మహర్షి విమానార్చన కల్పం అనే గ్రంథాన్ని రచించారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆరాధన, విధి విధానాలకు ఈ గ్రంథం ఎంతో ప్రామాణికమైందన్నారు. ఈ గ్రంథంలో పేర్కొన్న విధంగానే శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవ జరుగుతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ పండితులు శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ అర్చకం అనంతశయనం దీక్షితులు, ఖాద్రి నరసింహాచార్యులు, శ్రీ పి.కే.వరదన్ భట్టాచార్యన్, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ గంజాం రామకృష్ణ, జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు శ్రీ తనోజు విష్ణువర్ధన్, ధర్మగిరివేద విజ్ఞాన పీఠం విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.