MATSYA JAYANTHI OBSERVED _ వసంత మండపంలో మత్స్యరూప లక్ష్మీనారాయణ పూజ
Tirumala, 14 Apr. 21: Special puja was has performed to Sri Mastyarupa Lakshmi Narayana on the occasion of Matsya Jayanthi at Vasantha Mandapam in Tirumala on Wednesday.
This is as part of Chaitramasa Utsavams organised by TTD and live program by SVBC. The puja was held between 9am and 10am and telecasted live on SVBC for the benefit of global devotees.
Matsya Mahamantram was recited by Vedic scholars for 108 times under the supervision of Vedic Scholar Sri Mohana Rangacharyulu.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వసంత మండపంలో మత్స్యరూప లక్ష్మీనారాయణ పూజ
తిరుమల, 2021 ఏప్రిల్ 14: తిరుమలలోని వసంత మండపంలో బుధవారం ఉదయం మత్స్యజయంతిని పురస్కరించుకుని మత్స్యరూప లక్ష్మీనారాయణ పూజ ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం ఎస్వీబీసీ ద్వారా నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ, ఫాల్గుణమాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. ఈ క్రమంలో చైత్ర మాస ఉత్సవాల్లో భాగంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్షప్రసారం చేసింది.
ఇందులో భాగంగా వసంత మండపంలో మత్స్యావతారమూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, అర్చకులు, వేదపండితులు 24 పర్యాయాలు మత్స్య గాయత్రీ మంత్రం, మత్స్య అష్టోత్తరాలను పారాయణం చేశారు. అనంతరం 108 సార్లు మత్స్య మహామంత్ర పారాయణం చేశారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటిదన్నారు. మత్స్యపురాణం విశేషాలను వివరించారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.