‘MAYA’ MOHINI SWARUPA OF MALAYAPPA CHARMS PILGRIMS WITH KRISHNA SWAMY ON ANOTHER PALANQUIN, BLESSES DEVOTEES _ మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
Tirumala, 4 Oct. 19: The bright Sunny day on Friday, witnessed Sri Malayappa Swamy in His most bewitching Avatara of Mohini, the cosmic damsel on the colourfully decked Palanquin on the fifth day of annual brahmotsavams. The beauty of the Avatara enhanced with the presence of silver idol of Sri Krishna Swamy on another palanquin.
While all the other Vahana Sevas were carried by some divine flora and fauna as vehicles start from Vahana Mandapam, here the Lord pulls out Himself gracefully on a colorfully decorated palanquin, bejeweled, well dressed sporting a parrot in one hand, sitting majestically, charming devotees which commences from Srivari temple. According to legends, Lord’s appearance as bejeweled and charming Mohini throws the demons (Asura) in confusion and wins the celestial battle in favour of the deities (Devata).
The objective of the Mohini avatara also indicates that the entire universe is spell bound under the Mystic Moha and that the Lord of Tirumala is the kingpin and key architect of this high drama in the universe. He informs the devotees to come out of this “Maya” and lead a righteous, spiritual life. In other words, through Mohini Avatara, the lord enlightens his devotees not to fall prey to worldly desires and come out of that “Maya”.
TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
అక్టోబరు 04, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.
మోహినీ అవతారం – మాయా మోహ నాశనం
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన శనివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు స్వర్ణరథం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు గజవాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ పృథ్విరాజ్, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.