MEETING HELD WITH DALS MILLERS OF AP _ ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సమావేశం
TIRUMALA, 18 JUNE 2026: With a noble aim to supply high-quality delicacies involving dal in Annaprasadam (the massive free meals programme of Tirumala Tirupati Devasthanams), a meeting was held by the Additional EO Sri Ch Venkaiah Chowdary with Dal millers hailing from different parts of Andhra Pradesh in Tirumala on Thursday.
The meeting discussed in elaborate about the Quantitative and Qualitative supply of ingredients (dals) to TTD. The Additional EO said, TTD utilizes Seven varieties of dals in its daily consumption of Annaprasadam seven types of dals including Bengal Gram, Fried Bengal Gram, Black Gram without husk, Black gram with husk, Thoor Dal, Greengram and groundnuts. “In the last couple of years, we have improved the quality of rice by procuring the rice from the Rice Millers Association without any compromise and anticipating similar quality and quantity supply of Dals from Dal Millers of AP also, he asserted.
Responding positively, the representatives of AP Dal Millers also said they are willing to associate in the divine service of Annaprasadam activity of TTD- which is serving millions and millions of visiting pilgrims every day, by supplying the qualitative products.
Later the Additional EO instructed the officers concerned to work on the probabilities of procuring the Dals from the Millers in a transparent manner.
DyEO Annaprasadam Sri Rajendra Kumar, DyEO Warehousing Smt Padmavathi, GM Procurement Sri Umashankar, AEO Potu Sri Muniratnam, Special Officer Catering Sri Shastry, various Dal millers from AP were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సమావేశం
తిరుమల, 2026 జూన్ 18 ; తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు వంటి ఏడు రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని అదనపు ఈవో తెలిపారు.
గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు.
దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు మహా యజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై, నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అనంతరం పప్పు మిల్లర్ల నుంచి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.
ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వేర్ హౌసింగ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) శ్రీ ఉమాశంకర్, పోటు ఏఈవో శ్రీ మునిరత్నం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.





