MIGHTY NANDI VAHANAM _ నంది వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షం
Tirupati, 26 February 2025: Sri Somaskanda along with His consort Kamakshi Devi atop Nandi Vahanam paraded along the streets of the temple city on Wednesday evening.
On the auspicious festive day of Maha Sivaratri, the colourful procession took place.
Devotees seen offering Harati at all places chanting Jara Hara Maha Deva Sambho Shankara….
DyEO Sri Devendra Babu and other temple staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నంది వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 26: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి నంది వాహనంపై కటాక్షించారు.
భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.