MOCK DRILL OF SECURITY FORCES AT SRI KAPILA THEERTHAM TEMPLE _ శ్రీ కపిలతీర్థం ఆలయంలో భద్రతా దళాల మాక్ డ్రిల్
Tirupati, 02 May 2025: In the wake of the terror attack in the Pahalgam area of Kashmir, various security forces including Octopus, Police, TTD Vigilance and other departmental officers and staff jointly conducted a mock drill on the security measures to be taken in case of any infiltration of terrorists into the Sri Kapila Theertham Temple in Tirupati.
First, the Octopus forces entered the temple in three groups from the premises of the District Forest Department office near Kapila Theertham in a strategic and coordinated manner and demonstrated how to protect the devotees through a mock drill on Friday evening.
The TTD Vigilance and Security, Civil Police, Bomb Squad, Reserve personnel, Medical, Fire personnel, Revenue and Traffic personnel were thoroughly briefed on how to deal with a terrorist attack in this mock drill which continued for about two hours.
40 Octopus commandos, 10 TTD Vigilance personnel, 15 police personnel, 13 AR personnel, 12 medical personnel, Fire, Armed, Bomb Squad, Electrical, Water and Gas department personnel participated in this mock drill under the supervision of Octopus DSP Sri Madhusudhan Rao.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలతీర్థం ఆలయంలో భద్రతా దళాల మాక్ డ్రిల్
తిరుపతి, 2025 మే 2.: కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టిటిడి విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు.
ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు మూడు గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను శుక్రవారం సాయంత్రం మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.
ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రతా, సివిల్ పోలీసులకు, బాంబ్ స్క్వాడ్, రిజర్వ్ సిబ్బందికి, వైద్య, ఫైర్ సిబ్బందికి, రెవిన్యూ , ట్రాఫిక్ సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
దాదాపు రెండు గంటలపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 40 మంది ఆక్టోపస్ కమాండోలు, 10 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 13 ఏఆర్ సిబ్బంది, 12 మంది మెడికల్ సిబ్బంది, ఫైర్ , ఆర్మ్డ్ , బాంబ్ స్క్వాడ్, ఎలక్ట్రికల్ , వాటర్, గ్యాస్ శాఖల సిబ్బంది మాక్ డ్రిల్ లో భాగమయ్యారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ శ్రీ సి. రాజారెడ్డి, డిఎస్పీ శ్రీ మధుసుధన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.