MODERNISE ARTIFICIAL LIMBS CENTRE AT BIRRD- TTD EO _ బ‌ర్డ్‌లో కృత్రిమ అవ‌య‌వాల అమ‌రిక కేంద్రంను ఆధునీక‌రించాలి – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 29 Jan. 21: TTD Executive Officer,Dr KS Jawahar Reddy has directed officials to prepare an action plan for modernisation of the Artificial limbs Centre at BIRRD hospital to provide improvised sevices to patients.

Addressing a review meeting on development works at BIRRD hospital on Friday evening the TTD EO said the artificial limbs Centre which had successfully provided artificial parts to thousands of patients since its inception could help more and more people if modernised with equipment and systems.

He also directed TTD CMO to ensure supply of medicines on war footing for BIRRD hospital patients by making timely purchases after proper quality examinations etc.

He also advised officials to purchase the recent innovative Bionic Arm, also as and when needed.

He said from February 1, the maintenance of the hospital, its services and inventory of medicines and equipment would be brought under IT applications.

He also wanted a detailed policy document on BIRRD Trust be prepared to include all latest amendments in hospital management.

The TTD EO also asked officials to set up a Help Desk at BIRRD complex with Hospital staff to provide information on services to patients.

He also said the BIRRD doctors should also scale up their research work every year and also organise camps to serve needy patients across different parts of the country.

TTD JEO Sri P Basanth Kumar, BIRRD Hospital Honorary Director Dr Madanmohan Reddy, CE Sri Ramesh Reddy, FACAO Sri O Balaji, CMO Dr Narmada, IT in-charge Sri Shesha Reddy, AEO Sri Parthasarathy were also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ‌ర్డ్‌లో కృత్రిమ అవ‌య‌వాల అమ‌రిక కేంద్రంను ఆధునీక‌రించాలి –  టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2021 జనవరి 29: బ‌ర్డ్ ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు మ‌రింత త్వ‌రిత‌గ‌తిన సౌక‌ర్య‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు, కృత్రిమ అవ‌య‌వాల అమ‌రిక కేంద్రంను ఆధునీక‌రించేందుకు కార్యా‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రిలో ఈవో ఆసుప‌త్రి అభివృద్ధిపై శుక్ర‌వారం సాయంత్రం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ‌

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రారంభ ద‌శ నుండి ఎన్నో వేల మంది రోగుల‌కు ఈ కేంద్రం నందు కృత్రిమ అవ‌య‌వాలను అందించ‌డం జ‌రిగింద‌ని, అయితే దీనిని ఆధునీక‌రించ‌డం ద్వారా మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌వ‌చ్చ‌న్నారు. బ‌ర్డ్ ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు అవ‌స‌ర‌మైన మందుల స‌ర‌ఫ‌రా కొర‌కు టిటిడి సిఎమ్‌వో ఆధ్వ‌ర్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు మందులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచేందుకు వేంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. కోనుగొలు చేసే మందులు, వైద్య ప‌రిక‌రాల నాణ్య‌తను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అదేవిధంగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన బయోనిక్ ఆర్మ్‌‌ల‌ను రోగుల అవ‌స‌రాల రీత్యా కోనుగొలు చేయాల‌న్నారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌ట‌వ తేదీ నుండి నూత‌న బ‌ర్డ్ ఆసుపత్రి నిర్వహణ, సేవ‌ల విధానాన్ని (ఐటి అప్లికేషన్)  అందుబాటులోనికి తీసుకురావాల‌న్నారు. బ‌ర్డ్ ట్ర‌స్టుకు సంబంధించి ప్ర‌స్తుతం ఉన్న బ‌ర్డ్ ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ‌లో కొన్నిమార్పుల‌తో స‌మ‌గ్ర‌మైన వివ‌రాల‌తో కూడిన పాల‌సీ డాకుమెంట్‌ను రూపొందించాల‌న్నారు. ఆసుప‌త్రి అవ‌ర‌ణ‌లో రోగులకు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని ఇచ్చేందుకు బ‌ర్డ్ ఆసుప‌త్రి సిబ్బందితో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాల‌న్నారు. బ‌ర్డ్ నందు వైద్య సేవ‌లు అందించే వైద్యులు ప్ర‌తి సంవ‌త్స‌రం త‌మ ప‌రిశోధ‌న‌లు మ‌రింత పెంచాల‌ని కోరారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌లో రోగుల స‌హాయ నిమిత్తం క్యాంపుల సంఖ్య పెంచాల‌ని అధికారుల‌కు సూచించారు.  

ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజీ, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర‌, సిఎమ్‌వో డాక్ట‌ర్ న‌ర్మ‌ద‌
ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.